Posted by
ప్రసాద్ |
Thursday 14 October 2010
|
|
5
comments
నేను అనేక పాత సినిమి పాటలు సేకరించాను, సేకరిస్తూనే ఉన్నాను. అయితే నాకు చాలా కాలంగా ఒక పాట లోని కొద్ది భాగం మాత్రమే స్ఫురిస్తుంది. కాని దాని వివరాలు తెలియటం లేదు, అన్వేషణ కొనసాగుతూనే ఉంది. పాట లోని ఆ భాగం క్రింద చూడండి.
Posted by
ప్రసాద్ |
Sunday 3 January 2010
|
|
2
comments
03.01.2010 ఉదయాన్నే ఈతెలుగు బృందం సభ్యులు శ్రీ కశ్యప్ గారు, శ్రీ చక్రవర్తి గారు, శ్రీ సతీష్ గారు, డా. కౌటిల్య గారు విజయవాడ చేరుకున్నారు. అక్కడి నుండి ఏర్పాట్లలో నిమగ్నమై నన్ను, నవ్వులాట శ్రీకాంత్ గారిని కాంటాక్ట్ లొ ఉంచుకుని ఆ రోజు కార్యక్రమాలపై చర్చించి ఉ. 11 గం. ల కల్లా వాసవ్య మహిళా మండలి చేరుకున్నారు. అంతకు ముందు రోజే వాసవ్య మహిళా మండలి అద్యక్షురాలు, మాజి పార్లమెంటేరియన్ మరియు ప్రముఖ సంఘసేవకురాలైన శ్రీమతి చెన్నుపాటి విద్య గారిని, వాసవ్య మహిళామండలి కార్యదర్శి అయిన శ్రీమతి రశ్మి గారిని నేను, నవ్వులాట శ్రాకాంత్ గారు కలిసి వారి సహాయ సహకారాలను కోరి వారి అనుమతి తో వారి ఆర్గనైజేషన్ లొ కంప్యూటర్ పై పనిచేసే దాదాపు 25 మందికి, ఔత్సాహికులకు ఈ-తెలుగు కార్యక్రమాలపై అవగాహన, శిక్షణ మరియు సాంకేతిక సహాయం అందించేందుకు ప్రణాళిక తయారుచేయటం జరిగింది. తదనుగుణంగా 03.01.2010 తేది ఉదయం 11.00 గం. లకు కార్యక్రమం ప్రారంభించేందుకు ఉద్యుక్తులౌతుండగా, వాసవ్య మహిళా మండలి లొ పనిచేసే శ్రీ ప్రసాద్ గారు అక్కడే వేరే ప్రోగ్రాం విషయం లొ వచ్చి ఉన్న మీడియావారికి మమ్మలను పరిచయం చేయటం, వారెంతొ ఆసక్తి కనబరచి ప్రెస్ మీట్ పెట్టమని అడగటం జరిగింది. హైదరాబాద్ నుంచి వచ్చిన ఈ-తెలుగు సభ్యులు, విజయవాడ నుండి నేను, శ్రీ శ్రీకాంత్ గారుఆ సమావేశంలొ పాల్గొని ఆ-తెలుగు ఆర్గనైజేషన్ చేపడుతున్న వివిధ కార్యక్రమాలు, లక్ష్యాలు వివరించటం జరిగింది. ఎంతో ఆసక్తిగా మీడియా వారు అనేక విషయాలపై చర్చించారు కూడా. ఆ సమావేశం వీడియో క్రింద చూడండి.
తదనంతరం వాసవ్య మహిళా మండలి హాల్ లొ దాదాపు 30 మంది కి ఎల్.సి.డి ప్రొజెక్టర్ వినియోగించి డెమో ఇవ్వటం, వారి యాక్టివ్ ఇంటరాక్షన్ తొ ఎంతొ లైవ్లీ గా కార్యక్రమం జరిగింది. ఎంతో ఎంతో ఒత్తిడి పనులలొ మునిగిపోయి ఉన్నప్పటికి శ్రీమతి రశ్మి గారు ఈ కార్యక్రమానికి హజరై ఈ నైపుణ్యాలు ఉపయోగించి బ్లాగ్ లు క్రియేట్ చేసుకోవాలని, వాటి ద్వారా అందరికి ఉపయోగపడే విధంగా పోస్ట్ లు చేసి పేరుతెచ్చుకోవాలని, ఎదుటి వారిని విమర్శించటం కాకుండా తమ తమ భావాలను, తమకు తెలిసి పది మందికి ఉపయోగపడే విషయాలను మాత్రమే బ్లాగ్ ల లో వ్రాయాలని అనేక ఉదాహరణలతో వివరించి, ఇంత మంచి కార్యక్రమానికి తమ వాసవ్య మహిళా మండలి ని ఎంచుకున్నందుకు ఈ-తెలుగు ఆర్గనైజేషన్ వారికి ధన్యవాదాలు తెలియచేయటం జరిగింది. ఈ కార్య క్రమానికి సంబంధించిన వీడియో మరియు కొన్ని ఫోటోలను క్రింద చూడవచ్చు. దాదాపు మద్యాహ్నం గం. 2.30 ని. లకు కార్యక్రమాన్ని ముగించి సాయంత్రం కార్య క్రమాన్ని విజయవాడలో జరుగుతున్న 21 వ పుస్తక మహోత్సవం లొ నిర్వహించటానికి తగిన ఏర్పాట్లు చేసుకోవటం జరిగింది.
వాసవ్య మహిళా మండలి వారికి, వారి సిబ్బందికి ఈ-తెలుగు తరఫున కృతజ్ఞత లు తెలియచేసుకుంటూ ఈ పోస్ట్ ను ముగిస్తున్నాను.
ఇలాటి బ్లాగ్ లు సృష్టించడం, వాటి ద్వారా కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ లో తెలుగును ఉపయోగించడం ఆ విధంగా ఇ-తెలుగును ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి అనునిత్యం నా లాంటి వారిని ఎంతోమందిని ప్రోత్సహిస్తున్న శ్రీ నల్లమోతు శ్రీధర్ (కంప్యూటర్ ఎరా) గారు,జ్యోతి వలబోజుగారు, శ్రీ వీవెన్ గారు, శ్రీనివాస్ కర గారు, జివి గారు, మహేష్ రెడ్డి (మహి గ్రాఫిక్స్- శ్రీశైలం) గారు తదితరులందరికి మన:పూర్వక ధన్యవాదములు..
చిలకపాటి శివరామ ప్రసాద్